- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎన్నికల్లో వారిని గెలిపించండి
దిశ, ఇల్లెందు : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర

దిశ, ఇల్లెందు : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు లు కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని బోజ్జాయిగూడెం, మొండితోగు, రొంపేడు, కొమ్ముగూడెం, కోమరారం, మాణిక్యారం, పోలారం, పోచారం, మామిడిగూడెం లలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బలపరిచిన అభ్యర్థులు, మసివాగులో స్వతంత్ర అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, గిట్టుబాటు ధరలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు, నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం లాంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. గత 40 ఏళ్లుగా తమ పార్టీ ఆదివాసి, గిరిజన, పేదల సమస్యలపై పోరాడుతుందని, ప్రజలకు భూములు సాధించి పెట్టిందని, పట్టాల సాధన కోసం పోరాటాలు చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు.
40 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో దొరన్న, ఎల్లన్న, బాటన్న, కాచనపల్లి అమరులు, లింగన్న, పాషన్న, బోర్ర వీరస్వామి, బొర్ర ముత్తయ్య, పగడాల వెంకన్న, చీమల నరసన్న, చింత పంతులు, ఎల్వి, కోడి శ్రీరాములు పోరు బాటలో తమ జీవితాన్ని ప్రజల కోసం అర్పించారని కొనియాడారు. తమ పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు తోడ్పడే పథకాల కోసం నిజాయితీగా పనిచేశారని, గ్రామాల్లో రోడ్లు, కరెంట్, పక్కా గృహాలు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే పథకాల అమలుకు కృషి చేశారని తెలిపారు. చిన్న పదవులకే వ్యక్తిగత ఆస్తులు పెంచుకొని స్వార్థపరులుగా మారి తమ అవసరాల కోసం నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి పార్టీలను తేలిగ్గా మారుతున్న పరిస్థితి నెలకొందని, తమ పదవులను రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్న సంస్కృతిని తిప్పి కొట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నీ ఓడించేందుకు కుట్రలు, కుయుక్తులతో పాటు అధికారాన్ని వినియోగించి నిర్బంధాన్ని అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి వారి కోసం నిరంతరం కృషి చేసే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థులు, ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, నాయకులు మోకాళ్ళ రమేష్, ఎండి రాసుద్దీన్, యదళ్లపల్లి సత్యం, కొప్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు.






