- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ప్రైవేట్' పై కొరడా- అనుమతులు లేని వైద్యశాల సీజ్
ఇటీవల కాలంలో అనుమతి లేకపోయినా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తుండడం... అర్హత లేని వారు దొంగ పత్రాలతో డాక్టర్లు అని చూపించుకుంటూ... వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని... వార్తలు దావానంలా రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ శుక్రవారం తనిఖీలు చేపట్టారు.

దిశ, పాల్వంచ టౌన్: ఇటీవల కాలంలో అనుమతి లేకపోయినా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తుండడం... అర్హత లేని వారు దొంగ పత్రాలతో డాక్టర్లు అని చూపించుకుంటూ... వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని... వార్తలు దావానంలా రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు చికిత్స చేస్తుండగా వైద్యాధికారి వెళ్లి వారిని విచారించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు.
ఆసుపత్రికి సంబంధించిన పత్రాలన్నీ తనకు చూపించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ స్కానింగ్ సెంటర్‌ను సైతం తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని కారణంగా వైద్యశాలను సీజ్ చేయించారు. అర్హత లేని వారు తప్పుడు ధృవ పత్రాలతో తాము వైద్యులమని చెప్పుకుంటూ ప్రజలకు వచ్చిరాని వైద్యం చేసి ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, కచ్చితంగా అన్ని అనుమతులు ఉంటేనే, అన్ని పత్రాలు ఉంటేనే ఆసుపత్రులను ప్రారంభించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరుగుతుందని, సరైన పత్రాలు లేని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.






