ఇన్ చార్జి ఎంపీవో ఎక్క‌డ‌..?

by Ratna Kumari |

త‌ల్లాడ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఎంపీఓగా విధులు నిర్వ‌హించిన సురేష్ బాబు రెగ్యుల‌ర్ ట్రాన్స్ ఫ‌ర్ లో భాగంగా ఏప్రిల్ 21న క‌ల్లూరు మున్సిపాలిటీకి బ‌దిలీ పై వెళ్లారు.

ఇన్ చార్జి ఎంపీవో ఎక్క‌డ‌..?
X

దిశ, తల్లాడ : త‌ల్లాడ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఎంపీఓగా విధులు నిర్వ‌హించిన సురేష్ బాబు రెగ్యుల‌ర్ ట్రాన్స్ ఫ‌ర్ లో భాగంగా ఏప్రిల్ 21న క‌ల్లూరు మున్సిపాలిటీకి బ‌దిలీ పై వెళ్లారు. అప్ప‌టి నుంచి ఏన్కూర్ పరిధిలో గల ఎంపీవో గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకట సత్యనారాయణకు ఇన్ చార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏన్కూర్ ఎంపీవో బాధితులు నిర్వహిస్తున్న జి.వెంకట సత్యనారాయణ ఏన్కూర్ మేజర్ పంచాయతీకి, ఆరికలపాడు గ్రామపంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఏన్కూర్ మండల పరిధిలోని 25 గ్రామపంచాయతీలకి ఎంపీవో గా విధులు నిర్వహిస్తున్నారు.


అలాగే తల్లాడ మండలంలోని 27 గ్రామ పంచాయతీకి ఇన్ చార్జి ఎంపీవో గా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యల పట్ల రోజు ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏన్కూర్ మండల పరిధిలోని రెగ్యులర్ ఎంపీఓగా విధులు నిర్వహించడం ఆయనకు భారంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆ అధికారికి కష్టంగా మారిందని ఎప్పుడు చూసిన ఆఫీసులో ఖాళీ కుర్చీ దర్శనమిస్తుందని ప్రజలు వాపోతున్నారు. తాను ఎంపీవోగా గ్రామ సెక్రెటరీలకు అందుబాటులో ఉండి మండల పరిధిలోని పంచాయతీల అభివృద్ధి పనులను పర్యవేక్షించడం,గ్రామ కార్యదర్శిలకు (పంచాయతీ సెక్రటరీలు) దిశా నిర్దేశం చేయడం తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి. అలాంటి అధికారి అందుబాటులో లేకపోవడంతో సమస్యలన్నీ నత్త నడక నడుస్తున్నాయని ప్రజలు అంటున్నారు.

అదే విధంగా అయిన ఇన్ చార్జి ఎంపీవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం తల్లాడ మండలానికి రెండుసార్లు మాత్రమే అధికారి ఆఫీసుకు వచ్చారు అని ఒక్కటి ఎంపీవో గా బాధ్యతలు చేపట్టినప్పుడు. మరొకసారి గ్రామపంచాయతీ సెక్రటరీల రివ్యూ మీటింగ్ కొరకు వచ్చారు. ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ రాజు ఫీల్డ్ విజిట్ కొరకు ప్రతిరోజు గ్రామ పంచాయతీలకు వెళ్లడంతో అదే సమయంలో ఇద్దరు అధికారులు మండల పరిషత్ కార్యాలయంలో లేకపోవడంతో వివిధ పనులను నిమిత్తం మండలంలోని 27 గ్రామపంచాయతీ నుండి ప్రజల సమస్యలను వినిపించు అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు తీవ్ర నిరాశతో వెను తిరిగి వెళుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా డీపీఓ (జిల్లా పంచాయతీ అధికారి)చొరవ తీసుకొని తల్లాడ మండలానికి రెగ్యులర్ ఎంపీవో ను నియమించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజల కోరుతున్నారు.

Next Story