- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"కూతురే కొడుకు అయిన వేళ"
దిశ, చర్ల : ఓ కూతురే తన తండ్రికి కొడుకై తలకొరివి పెట్టంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలోని రైస్ పేట కా

దిశ, చర్ల : ఓ కూతురే తన తండ్రికి కొడుకై తలకొరివి పెట్టంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలోని రైస్ పేట కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైసుపేట గ్రామానికి చెందిన పూనెం లక్ష్మీనారాయణ లక్ష్మీ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు అందులో పెద్ద కుమార్తె పూనెం భాగ్యలక్ష్మి, పూనెం ఉషారాణి ఉన్నారు. కొంతకాలం క్రితం భద్రాచలం నివాసి అయిన కనకం శ్రీమన్నారాయణ ను కులాంతర వివాహం చేసుకున్న పూనెం భాగ్యలక్ష్మి కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి అయిన పోణ్యం లక్ష్మీనారాయణ తీవ్ర అస్వస్థకు గురై 28 న ఆదివారం చికిత్స పొందుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరణించారు. కుమారుడు లేని తన ఇంటిలో సంప్రదాయపరంగా కొరివి పెట్టాల్సిన బాధ్యత పెద్ద కుమార్తె అయిన పూనెం భాగ్యలక్ష్మి తీసుకొని తన తండ్రికి భారీ జన సందోహంతో ఊరేగింపుతో అంత్యక్రియలు నిర్వహించారు. కన్నతండ్రి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన చూసిన చర్ల మండల ప్రజలు శభాష్ అంటూ కంటే కూతుర్నే కనాలి అంటూ అభినందిస్తున్నారు.






