- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి
దిశ, మణుగూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదిరించుకున్న కాంగ్రెస్ తమను మోసం చేసిందని సీపీఎం

దిశ, మణుగూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదిరించుకున్న కాంగ్రెస్ తమను మోసం చేసిందని సీపీఎం నాయకులను దెబ్బతీసిందని మణుగూరు మండల సీపీఐ నాయకులు అన్నారు. శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ అహంకార ధోరణితో కన్నతల్లి లాంటి కమ్యూనిస్టు పార్టీని చులకన చేసి మాట్లాడుతూ మీ పార్టీ ఎంత మీ లెక్కెంత అంటూ అవమానకర మాటలతో ఇబ్బందులకు గురి చేసారన్నారు. అయినా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పొత్తు ధర్మం పాటించిందని, కాంగ్రెస్ పార్టీ దాన్ని విస్మరించి సీపీఐ ని దెబ్బ తీయాలని చూసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా స్థానిక సంస్థల్లో కూడా కలిసి పని చేయాలని పార్టీ నిర్ణయం మేరకు ఇరు పార్టీలు కూర్చొని చర్చించుకోవడం జరిగిందన్నారు. మణుగూరు మండలంలో 14 పంచాయతీలు ఉండగా 7 పంచాయతీలు ఇవ్వాలని ముందుగా అడగడం జరిగిందని దానిలో ఐదు పంచాయతీ లలో ఒక పంచాయతీ మాకు ఇవ్వాలని కాంగ్రెస్ అడగగా దమ్మక్కపేట పంచాయతీ వారికి కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన నాలుగు పంచాయతీలు సీపీఐ కి ఇవ్వాలని అడగగా కేవలం సాంబాయిగూడెం పంచాయతీ రామానుజవరం పంచాయతీ రెండే ఇస్తామని మిగిలిన 12 పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారన్నారు.
పొత్తు ఓకే అయ్యాక సర్పంచులు వారు పోటీ చేసే దగ్గర మేము వారిలో గెలిచిన సభ్యులకు సీపీఐ ఉపసర్పంచ్ ఇవ్వాలని సీపీఐ సర్పంచ్ దగ్గర కాంగ్రెస్ గెలిస్తే వారికి ఉప సర్పంచ్ ఇచ్చే విధంగా ఇరువురు అంగీకారం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సీపీఐ నాయకులను కార్యకర్తలను అడుగడుగున అవమాన పరుస్తూ పార్టీని నాయకులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది చాలా దుర్మార్గమని చివరకు వార్డులు ఎంత వాటి లెక్క ఎంత వాటి దగ్గర కూడా ఎమ్మెల్యే అంత పట్టుపట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. చివరకు కమ్యూనిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయాలని చూడడం దుర్మార్గం అన్నారు. ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రమించి గెలిపించారని ఎప్పుడూ సీపీఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందన్నారు. ఈ ప్రాంతంలో సీపీఐ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, సొసైటీలుగా గెలిపించుకున్న సత్తా సిపిఐ పార్టీదని ఈనాడు పార్టీ ఉనికినే లేకుండా చేయాలని చూడడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదన్నారు. అధికార పార్టీ చేసే అన్ని కార్యక్రమాలను విధానాలను ప్రజలు, సీపీఐ గమనిస్తుందని ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు సమితి సింగారం ఇన్ చార్జి జంగం మోహన్ రావు, మణుగూరు మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్, జిల్లా గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే కుటుంబరావు, రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య, ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్షులు రాయల భిక్షం, మండల కార్యదర్శి గడ్డ వెంకటేశ్వర్లు, పట్టణ సహయ కార్యదర్శి తోట రమేష్, మండల సహాయ కార్యదర్శి వేర్పుల నరేష్, వజ్జా వెంకటేశ్వర్లు, అదెర్ల రాములు పాల్గొన్నారు.






