- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి ఏంటి..? సార్..
ఏజెన్సీ ప్రాంతంలో సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ ఉండి రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాదా బైనమా దరఖాస్తులపై ప్రత్యేక నిర్ణయం తీసుకొని రైతులకు లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దిశ, ఏన్కూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టి రైతులను ముప్పతిప్పలు పెట్టిన సంగతి గుర్తించి.. ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతులకు ఆమోదయోగంగా ఉన్న భూ భారతి ప్రవేశపెట్టి రైతు సమస్యలు తీరుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మారితే రైతులకు న్యాయం జరుగుతుందని ఆశ పడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులకు సాదా బైనామా ద్వారా పట్టా పాస్ బుక్ పొందేందుకు రైతులు ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకుంటే వారిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని తమ వారసులకు ఇవ్వడానికి తాతలు తండ్రుల నాటి ఆస్తి వారసత్వపు హక్కుగా ముందుకొచ్చినప్పటికీ, పాసుబుక్కులు ముందే అందుకు ఎలాంటి మోక్షం లేకపోవడంతో రైతులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవస్థలో ప్రత్యేకమైన మార్పులు తీసుకొస్తూ ప్రజలకు చేరువయ్యే విధంగా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్లను ఏర్పాటు చేసి రెవెన్యూ సేవలను గ్రామస్థాయిలో అందించే విధంగా కృషి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ ఉండి రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాదా బైనమా దరఖాస్తులపై ప్రత్యేక నిర్ణయం తీసుకొని రైతులకు లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కూసుమంచి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తీసుకొని రెవెన్యూ సేవలను వేగవంతం చేస్తున్న తరుణంలో జిల్లాలోని అన్ని మండలాల్లో సాదా బైనామా పై ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాసుబుక్కులు అందే విధంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.






