- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెడ్డింగ్ కార్డ్.. ఈసారి మరింత వినూత్నంగా డిజైన్
ఆ ఇద్దరు ఇష్టపడ్డారు... వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనం ఈ వెడ్డింగ్ కార్డ్.

దిశ, జూలూరుపాడు: ఆ ఇద్దరు ఇష్టపడ్డారు... వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనం ఈ వెడ్డింగ్ కార్డ్. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డును తయారు చేశారు. అది చూసిన వారంతా టాబ్లెట్ షీట్ అనుకున్నారు. కానీ మొత్తం క్షుణ్ణంగా చదివితే కానీ అది వివాహ ఆహ్వాన పత్రిక అని అర్థం కాదు.. వధూవరులు ఇద్దరు ఫార్మా రంగంలో పని చేస్తూ ఉండడం.. ఇష్టమైన వృత్తి ఒకవైపు, మరోవైపు ఇద్దరి మధ్య అనురాగం కలిపి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకు వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న పెళ్లి పత్రిక ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన పెళ్లి పత్రికను వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి గౌరవంగా రూపొందించి అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. ఆ పెళ్లి పత్రికను చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా టాబ్లెట్ షీట్ అని భ్రమ పడే విధంగా ఉంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర భాస్కర్, ధనమ్మ దంపతుల కుమారుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. శిరీష కూడా ఎం.ఫార్మసి పూర్తి చేసి ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. వధూవరులిద్దరూ ఫార్మా రంగానికి చెందిన వారు కావడంతో, తమ వివాహ ఆహ్వాన పత్రిక కూడా అదే శైలిలో ఉండాలని ఆలోచన చేశారు.






