మతతత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.. : తమ్మినేని వీరభద్రం

by Chintha Aamani |   (  Updated:2025-07-30 12:06:02  IST  )

ద్రంలోని బీజేపీ పాసిస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

మతతత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.. :  తమ్మినేని వీరభద్రం
X

దిశ,తల్లాడ: కేంద్రంలోని బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సత్తుపల్లి డివిజన్ కమిటీ ప్లీనరీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండు అధ్యక్షతన తల్లాడ జిఎన్నార్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు ఐక్యంగా పోరాడటంతో 62 పార్లమెంటు సీట్లు తగ్గించగలిగామన్నారు. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా బ్రిటిష్ వ్యాపార ఒప్పందం తో మన దేశ ఉత్పత్తిదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని సుంకం లేని వస్తువులు మన దేశంలో కారు చౌకగా లభిస్తుంటే మన ఉత్పత్తులను అధిక ధర చెల్లించి ఎవరో కొనుగోలు చేయరని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహిస్తామన్నా మహారాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం అవుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలు అమలు పరచడంలో విఫలం అయిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయాలని అసమర్థ ప్రభుత్వం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పథకాలను ప్రారంభించి చేపిస్తున్నారని పూర్తయ్యే అవకాశం లేదన్నారు.అరకొర నిధులే విడుదల చేశారు, ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,జిల్లా నాయకులు తాతా భాస్కరరావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మండల కార్యదర్శి ఐదోల రామలింగేశ్వర రావు, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, మాదాల వెంకటేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునుల తదితరులు పాల్గొన్నారు.

Next Story