ఆ లేఖతో మాకేం సంబంధం లేదు : మావోయిస్టు పార్టీ

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-22 12:17:22  IST  )

దుమ్ముగూడెంలోని రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల పేర్లతో గత వారం రోజుల కిత్రం చర్ల మండలంలో విడుదలైన లేఖకు మాకు ఎలాంటి సంబంలేదని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుతో సోమవారం మరో లేఖ విడుదలైంది.

ఆ లేఖతో మాకేం సంబంధం లేదు : మావోయిస్టు పార్టీ
X

ఆ లేఖతో మాకేం సంబంధం లేదు

లచ్చన్న పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

దిశ చర్ల: చర్ల : దుమ్ముగూడెంలోని రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల పేర్లతో గత వారం రోజుల కిత్రం చర్ల మండలంలో విడుదలైన లేఖకు మాకు ఎలాంటి సంబంలేదని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుతో సోమవారం మరో లేఖ విడుదలైంది. ఆ లేఖలో మా డివిజన్ కమిటీ పేరుతో లేఖ వచ్చిందని, భూస్వాయ్య పెత్తందారులారా ఖబడ్డార్ అని హెడ్లైన్ పెట్టి అందులో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండల రాజకీయ నాయకుల పేర్లతో పాటు, మరో విలేకరి పేరును ప్రస్తావించారు. విప్లవ అనే పేరుతో సంతకం చేశారు. లేఖలో ప్రకటించిన వారిలో కొంత మంది రాజీకయ నాయకులు, మరి కొంత మంది ఇతరులు ఉన్నారు. కావాలనే పని గట్టుకుని ప్రజలకు ఏది నిజమో గందర గోళం సృష్టించడానికి మా పార్టీ పేరతో లేఖ ఇచ్చారు. కానీ ఆ లేఖకు మాకు ఎలాంటి సంబంలేదని లచ్చన్న లేఖలో పేర్కొన్నాడు

Next Story