ఉపాధ్యాయుడి కోసం గ్రామస్తుల నిరసన

by velandi.Saikiran |

ఉపాధ్యాయుడి కోసం గ్రామస్తులు నిరసనకు దిగారు. తిమ్మరావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే

ఉపాధ్యాయుడి కోసం గ్రామస్తుల నిరసన
X

దిశ, ఏన్కూర్ : ఉపాధ్యాయుడి కోసం గ్రామస్తులు నిరసనకు దిగారు. తిమ్మరావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడుని డిప్యూటేషన్ పై కొత్త మేడేపల్లికి బదిలీ అయ్యారు. అయితే ఈ డిప్యూటేష‌న్ ను నిరసిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. సుమారు 60 మంది పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఒక ఉపాధ్యాయున్ని డిప్యూటేషన్ పద్ధతిపై బదిలీ చేయడాన్ని నిరసిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. చంద్రశేఖర్ వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. తక్షణమే డిప్యూటేషన్ పై వెళ్లిన చంద్రశేఖర్ ను తిరిగి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎంఈఓ వాసవి దేవి చ‌ర్య‌లు తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Next Story