గ్రామ అభివృద్దే మా లక్ష్యం : మాజీ స‌ర్పంచ్ క‌ళ్లెం వెంక‌ట్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఖమ్మం రూరల్ : గ్రామ అభివృద్దే మా లక్ష్యం అని, అందుకోసమే గుండు శ్రావణి శ్రీనివాస్ ఉంగరం గుర్తు పై ఓటు వేసి అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు, మాజీ

గ్రామ అభివృద్దే మా లక్ష్యం : మాజీ స‌ర్పంచ్ క‌ళ్లెం వెంక‌ట్ రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్ : గ్రామ అభివృద్దే మా లక్ష్యం అని, అందుకోసమే గుండు శ్రావణి శ్రీనివాస్ ఉంగరం గుర్తు పై ఓటు వేసి అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ కళ్లెం వెంకట్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులోని ఊటవాగుతండలో సర్పంచ్ అభ్యర్థి గెలుపుపై ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి తండవాసులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్గా శ్రావణిని ఆశీర్వదిస్తే, మీరు చెప్పిన సమస్యలన్ని పూర్తి చేపించే భాద్యతనాదేనన్నారు. చెప్పుకుంటున్నని కాదు కానీ ఈ ప్రాంతంలో ఎటువంటి హామీలు ఇవ్వని, పనులతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలు చేసినట్లు వివరించారు. ప్రజల తలలో నాలుకలా పిలిస్తే పలికే సర్పంచ్ అభ్యర్థినికి పట్టం కట్టాలన్నారు. ప్రధానంగా డ్రైనేజీలు, సీసీరోడ్డు, పొలాల, గ్రామాలలోకి వెళ్లే లింక్డ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే 10వ వార్డు మెంబర్ వెలుతూరి సతీష్ గ్యాస్ పోయి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోళ్లపాడు గ్రామశాఖ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లయ్య నాయక్, శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story