- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైన్‌మెన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ..
by Kodari Anjali |
తల్లాడ మండలం కుర్నవల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్ యాకూబ్ అక్రమాలపై శనివారం విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు.

X
దిశ, తల్లాడ: తల్లాడ మండలం కుర్నవల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్ యాకూబ్ అక్రమాలపై శనివారం విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. యాకూబ్ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ముద్దనూరు గ్రామానికి చెందిన రైతు అనుమోలు రామారావు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎస్సై లవన్ కుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారుల బృందం విచారణ నిర్వహించారు. మండలంలోని ముద్దునూరు, రంగాపురం గ్రామాల్లో క్షేత్ర పరిశీలన జరిపి విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. బాధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు చెప్పిన వివరాల ఆధారంగా నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు.
Next Story






