ప్రపంచం ఉన్నంతవరకు వాల్మీకి చరిత్ర నిలుస్తుంది

by Sridhar Babu |
ప్రపంచం ఉన్నంతవరకు వాల్మీకి చరిత్ర నిలుస్తుంది
X

దిశ, కొత్తగూడెం : ప్రపంచం ఉన్నంతవరకు వాల్మీకి చరిత్ర నిలుస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం రచించి ప్రపంచానికి తెలియజేసిన ఆదికవి వాల్మీకి అన్నారు.

ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని తెలిపారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర, కలెక్టరేట్ పరిపాలనాధికారి రమాదేవి, బీసీ సంఘం నాయకులు మురికి వెంకన్న, భోగా నందకిషోర్, ఉలవల రాములు, గట్టేశం, కోడుమూరు సత్యనారాయణ, గుర్రం శ్రీనివాసరావు, చల్లా శివ, చెప్పా శ్రీనివాస్, చెప్పా వెంకటేశ్వరరావు, గొలుసు శ్రీనివాస్ రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story