- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో... యూరియా
సీజన్ వచ్చేసింది. పత్తి పంట పిండి దశలో ఉంది. వరి నాటు వేసి నెలరోజులు దాటుతోంది. మిర్చి పంటను రైతులు ఇప్పుడే

దిశ, కొత్తగూడెం: సీజన్ వచ్చేసింది. పత్తి పంట పిండి దశలో ఉంది. వరి నాటు వేసి నెలరోజులు దాటుతోంది. మిర్చి పంటను రైతులు ఇప్పుడే ప్రారంభించారు. అనుకున్న విధంగా వర్షాలు కూడా కురుస్తుండటంతో అన్నదాతలు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆశించిన మేరకు దిగుబడి రాదని సకాలంలో ఎరువులు లేకపోతే పంట ఎదుగుదల లోపించి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు ఉండవని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెల్లవారుజామునుంచే యూరియా కోసం బారులు తీరి అధికారులు వచ్చి తమ పేరు రాసి తమకు కచ్చితంగా యూరియా ఇస్తారని ఆశతో క్యూ కట్టిన రైతన్నలకు అధికారులు సరిపడా స్టాక్ రాలేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్నదాతలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. రైతులకు సరిపడా నిలువలు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. లక్ష్మీదేవి పల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరియా కోసం ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, యూరియా వస్తుందో లేదో ఇస్తారో లేదో కూడా తెలియని స్థితిలో రోజుల తరబడి ప్రతినిత్యం ఇలాగే జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా రైతుల గోసను ప్రభుత్వం అర్థం చేసుకొని సరిపడా యూనియన్ పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






