- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కూసుమంచి : రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొనడంతో.. ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన కూసుమంచి మండల గ్రామ శివారు సోనియా నగర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని తూరకగూడం గ్రామానికి చెందిన నరేష్ కుసుమంచి నుండి బైక్ మీద ఖమ్మం వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న గొరీల పాడుతండాకు చెందిన శ్రీను బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలంగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మండల కేంద్రంలోని పిహెచ్ సికి తరలించారు. ఇద్దరికి తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స అనంతరం 108 సహాయంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
Next Story






