- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala Nageswara Rao : ప్రజాసేవలో జక్కంపూడి కుటుంబం

X
దిశ, తల్లాడ : జక్కంపూడి ఫ్యామిలీ ప్రజాసేవలో తరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గురువారం వారి దిశదిన కర్మ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరై నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణమూర్తి బిల్లుపాడు గ్రామాన్ని గొప్పగా తీర్చిదిద్దిన నాయకుడని ప్రశంసించారు. జక్కపూడి దంపతులు 20 ఏళ్ళ పాటు గ్రామానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. తనకు జక్కంపూడి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






