- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి వ్యాపారులను రెచ్చగొట్టే వారిపై క్రిమినల్ చర్యలు : కమిషనర్ అభిషేక్ అగస్త్య
దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా గల వీధి వ్యాపారుల ప్రాంగణం లోని వ్యాపారులను రెచ్చగొట్టే కొందరు వ్యక్తులపై

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా గల వీధి వ్యాపారుల ప్రాంగణం లోని వ్యాపారులను రెచ్చగొట్టే కొందరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని, వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీధి వ్యాపారుల ప్రాంగణంలో కూరగాయల అమ్మకానికి సంబంధించి, కార్పొరేషన్ కార్యాలయంలో డిపాజిట్ చెల్లించిన వ్యాపారులకు భక్త రామదాసు కళాక్షేత్రం లో శుక్రవారం నిర్వహించాల్సిన డ్రా వాయిదా వేశామన్నారు. మార్కెట్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులు రెండు వర్గాలుగా విడిపోయి డ్రా నిర్వహణలో అంతరాయం కలిగించవచ్చని. అక్కడ పరిస్థితిని ఉద్రిక్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందిందని కమిషనర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల డ్యూటీలో పోలీస్ శాఖ నిమగ్నమై ఉండటంతో, డ్రా కార్యక్రమం సందర్భంగా ఏర్పడే అప్రతికూల పరిస్థితులకు అవసరమైన పోలీస్ బందోబస్తు అందుబాటులో లేదని పోలీస్ శాఖ అధికారికంగా తెలియజేసిందన్నారు. దీంతో డ్రా కార్యక్రమం వాయిదా వేశామని కమిషనర్ పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు స్వప్రయోజనాల కోసం వీధి వ్యాపారులను రెచ్చగొట్టి డ్రా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్లుగా లభించిన ఆధారాలపై, సంబంధిత వ్యక్తులపై పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశామని, వారి మీద క్రమినల్ కేసులు నమోదుకు చర్యలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనీ కమిషనర్ హెచ్చరించారు. ఈనెల 19న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య డ్రా నిర్వహిస్తామని తెలిపారు.






