టీఎస్ ఆర్టీసీకి... ఖమ్మం రీజినల్ లో రూ. 2.21 కోట్ల ఆదాయం

by Geesa Chandu |

రక్షాబంధన్ పర్వదినం నాడు రికార్డ్ స్థాయిలో.. 3 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానానికి చేరవేసినందుకు, సంస్థ సిబ్బంది అధికారులను ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ అభినందించారు.

టీఎస్ ఆర్టీసీకి... ఖమ్మం రీజినల్ లో రూ. 2.21 కోట్ల ఆదాయం
X

దిశ, సత్తుపల్లి: రక్షాబంధన్ పర్వదినం నాడు రికార్డ్ స్థాయిలో.. 3 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానానికి చేరవేసినందుకు, సంస్థ సిబ్బంది అధికారులను ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ అభినందించారు. ఖమ్మం రీజినల్ లో రక్షాబంధన్ పర్వదినం నాడు టిఎస్ఆర్టిసి బస్సులు రికార్డ్ స్థాయిలో 2.72. లక్షల కిలోమీటర్లు తిరిగాయని, సగటున 2.40 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, సోమవారం అదనంగా 32 వేల కిలోమీటర్లు తిరిగాయని.. రాఖీ పౌర్ణమి సందర్భంగా రికార్డు స్థాయిలో రూ. 2.21. కోట్ల ఆదాయం చేకూరిందని రీజినల్ మేనేజర్ తెలిపారు. అందులో అత్యధికంగా డిపోల వారీగా ఖమ్మం రూ. 60.38 లక్షలు, భద్రాచలం రూ. 42.91 లక్షలు, సత్తుపల్లి రూ.35.06 లక్షలు, మణుగూరు రూ. 26.98 లక్షలు, కొత్తగూడెం రూ. 25.07 లక్షలు, మధిర రూ. 24.8 లక్షలు, ఇల్లందు రూ. 5.97 లక్షలు. ఆర్టీసీకి రాబడి వచ్చిందని ఆయన ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రీజినల్ లో రాఖీ పండుగ రద్దీ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చినందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

Next Story