మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. లొంగిపోయిన అగ్రనాయకులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-24 09:41:39  IST  )

వరుస ఎన్కౌంటర్‌లతో మావోయిస్టులు సతమతం అవుతున్నారు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. లొంగిపోయిన అగ్రనాయకులు
X

దిశ, భద్రాచలం: వరుస ఎన్కౌంటర్‌లతో మావోయిస్టులు సతమతం అవుతున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితం ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో మృతి చెందగా, బుధవారం నారాయణపూర్ లో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఇదిలా ఉండగా.. చత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అగ్రనాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. లొంగిపోయిన మావోయిస్టుల పై 6.4 మిలియన్ల రివార్డ్ ఉండటం విశేషం.

Next Story