అమెరికా-ఇరాక్ యుద్ధం వల్లే కొరత !

by velandi.Saikiran |

అమెరికా-ఇరాక్ యుద్ధం వల్లే కొరత అని పేర్కొన్నారు మంత్రి తుమ్మ‌ల‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్

అమెరికా-ఇరాక్ యుద్ధం వల్లే కొరత !
X

దిశ, అశ్వారావుపేట: అమెరికా-ఇరాక్ యుద్ధం వల్లే కొరత అని పేర్కొన్నారు మంత్రి తుమ్మ‌ల‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల స్పందించారు. అమెరికా ఇరాక్ యుద్ధం వల్ల రెడ్ సీ మూసివేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి రెడ్ సీ ద్వారా యూరియా దిగుమతి అయ్యేది. కానీ రెడ్ సీ మూసివేయడం ద్వారా యూరియా కొరత ఏర్పడింద‌న్నారు. చైనా దేశం నుండి 70% ఇండియా కు యూరియా దిగుమతి అయ్యేది, వారు కూడా ఆపేశారని వివ‌రించారు. తెలుగు రాష్ట్రాల్లో రామగుండం, నాగార్జున ఫెర్టిలిజర్స్ మూసివేశారని తెలిపారు.

యూరియా కొరత ఉండకుడదనే గుజరాత్, భోపాల్ రాష్ట్రాల నుండి యూరియా దిగుమతి చేస్తున్నామ‌న్నారు. యూరియా పోర్టుల నుండి అన్ని జిల్లాలకు పంపిస్తున్నాని తెలిపారు. రైతులు ఆందోళన పడవద్దు. ఈ నెలలో రెండు లక్షల టన్నుల యూరియా రావాలని ప్ర‌క‌టించారు. యూరియా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని.... అందుకే కేంద్రం పై ఒత్తిడి తెచ్చానని ప్ర‌క‌టించారు. దీంతో అన్ని జిల్లాలకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు.

Next Story