- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవి పంది మాంసం విక్రయదారులు ముగ్గురు అరెస్ట్
అడవి పంది మాంసం విక్రయదారులైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, సత్తుపల్లి: వరి పొలంలో విద్యుత్ వైర్లు అమర్చి అడవిపందిని వేటాడిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం తాళ్ల పెంట గ్రామ శివారులో పులిగుండాల ప్రాజెక్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామం శివారులో పులిగుండాలు ఏకొ టూరిజం పర్యాటక ప్రాంతంలో ఉన్న అడవి పంది సమీప వరి పొలంలోకి వెళ్ళటంతో వరి పొలం చుట్టూ విద్యుత్ వైర్లు అమర్చి అడవి పందిని వేటాడిన మాసం విక్రయిస్తుండగా ఐదుగురు వ్యక్తుల్లోనూ మంగళవారం ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని ఐదుగురుపై కేసు నమోదు చేసి ముగ్గురుని రిమాండ్కు తరలించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ దాడిలోని వారి వద్ద నుంచి 50. కేజీల అడవి పంది మాంసం, రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవి జంతువులు వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.






