- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారపాకలో ‘దొంగల’ స్వైర విహారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పాత సారపాక ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పాత సారపాక ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు."మమ్మల్ని పట్టుకోగలరా?" అని సవాల్ విసిరేలా ఒకే రాత్రి, ఒకే ప్రాంతంలో రెండు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో పాత సారపాక వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పాత సారపాకకు చెందిన పుట్టి రాజు ఆర్చి ప్రక్క సందులోని తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని ముందే పసిగట్టిన దొంగలు, సోమవారం అర్ధరాత్రి ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాను తెరిచి అందులో దాచుకున్న తులాల కొద్దీ బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితులు తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా పడి ఉండటం, బంగారం మాయమవ్వడంతో లబోదిబోమంటున్నారు.
గోడదూకి వచ్చి.. బైక్ ఎత్తుకెళ్లారు!
రాత్రి మరో చోట పోట్రు అనిల్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేతివాటం ప్రదర్శించారు. ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు, వరండాలో పార్కింగ్ చేసి ఉన్న ఖరీదైన బైక్ ను అపహరించుకుపోయారు. దొంగలు గోడ దూకుతున్న దృశ్యాలు, బైక్ ఎత్తుకెళ్తున్న తీరు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
స్థానికుల భయాందోళన.. పోలీసుల విచారణ
ఒకే రోజు రెండు ఇళ్లల్లో దొంగతనాలు జరగడంతో పాత సారపాక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు స్థానిక దొంగలేనా ? లేక ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని రెక్కీ నిర్వహించి తెలుసుకున్న ప్రొఫెషనల్ గ్యాంగా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వరుస దొంగతనాలతో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని, పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచి, ఈ దొంగలను తక్షణమే పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






