- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంపకాల్లోనూ పోటాపోటీ..
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 22వార్డులకు గానూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. 11న జరగనున్న పోలింగ్ ఒక్కరోజు ముందు ఇరు పార్టీలు నగదు పంపిణీ చేస్తాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రూ.3కోట్లు అంటుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ అందుకు రెండు రెట్లు మిన్నగా రూ.5 కోట్లు సిద్ధం చేసిందని ప్రచారం. ముఖ్యంగా మున్సిపాలిటీలోని 6, 8, 13, 17 వార్డులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 6, 13వార్డుల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నవారు చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉండగా 8వ వార్డు అభ్యర్థిని బీఆర్ఎస్ తరఫున చైర్మన్‌గా ప్రకటించారు. ఈ వార్డుల్లోని ఓటర్లకు నగదు పంపిణీ పెద్ద ఎత్తున ఉండొచ్చని తెలుస్తున్నది. ఇతర వార్డుల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.2వేలు ఇచ్చే ఇస్తే.. ఈ ప్రత్యేకమైన వార్డుల్లో ఓటుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు వరకు పంపిణీ చేసే అవకాశం ఉందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేస్తున్నాయి.
దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 22వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 11న జరగనున్న పోలింగ్ ఒక్కరోజు ముందు ఇరు పార్టీలు నగదు పంపిణీ చేస్తాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరు ఎంత ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రూ.3కోట్లు అంటుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ అందుకు రెండు రెట్లు మిన్నగా రూ.5 కోట్లు సిద్ధం చేసిందని ప్రచారం ఊపందుకుంది. ఓటుకు రూ.5వేలు వరకు ఇవ్వచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఓటర్లకు ప్రలోభాలు షురూ..
ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేస్తున్నాయి. రోజుకొక క్వార్టర్ లిక్కర్, బిర్యానీ ప్యాకెట్లను రహస్యంగా అందజేస్తున్నాయి. కొన్ని వార్డుల్లో మందుతో పాటు శుభకార్యాలను తలపించే బంతి భోజనాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక అభ్యర్థులు వెంట ప్రచారానికి తిరగడానికి కుదుర్చుకున్న వారికి రోజుకు రూ.500 చొప్పున కూలి ఇస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించే లోపు ఈ ప్రలోభాలు మరింత ఎక్కువ కానున్నట్లు సమాచారం
ఆ వార్డుల్లో పైనే అందరి దృష్టి..
అశ్వారావుపేట మున్సిపాలిటీలో 6, 8, 13, 17ఈ వార్డులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 6, 13వార్డుల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నవారు చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్నారు. అదేవిధంగా 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని సైతం చైర్మన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్డులపైనే అందరూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశేషమేంటంటే ఈ వార్డులలోనే ఓటర్లకు నగదు పంపిణీ పెద్ద ఎత్తున ఉండొచ్చని పుకార్లు పుట్టాయి. ఇతర వార్డుల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.2వేలు ఇచ్చే అవకాశం ఉంటుందని, ఈ ప్రత్యేకమైన వార్డుల్లో ఓటుకు రూ.5 వేలు నుంచి రూ.10వేలు వరకు పంపిణీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఓటుకు ఎంత ధర పలుకుతుందనేది కొద్ది రోజులు వేసి చూడాల్సిందే. మరో వైపు ఎన్నికల్లో ఓటు హక్కుని అమ్ముకుని.. భవిష్యత్‌లో ప్రశ్నించే హక్కును కోల్పోవద్దని కొందరు విద్యావంతులు స్థానికంగా అవగాహన కల్పిస్తున్నారు.






