ఆ హత్యకు కారణం ప్రేమనా.. ఆర్థిక లావాదేవీలా..?

by Disha Web Desk 13 |
ఆ హత్యకు కారణం ప్రేమనా.. ఆర్థిక లావాదేవీలా..?
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: టేకులపల్లి మండలం లో జరిగిన అశోక్ కుమార్ హత్య వెనుక అనేక కోణాలు దాగి ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. మొదట హత్యకు కారణం ఆర్థిక లావాదేవీలే అనుకున్నప్పటికీ తీర్చగలిగే అప్పు కోసం అశోక్ కుమార్‌ను హతమార్చారు అన్న కారణం ప్రజలకు మింగుడు పడడం లేదు.అశోక్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్ పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి సోదరితో మృతుడి ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు మూల కారణమని జోరుగా చర్చ సాగుతోంది. పోలీసులు ఇదే కోణంలో విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. తీర్చగలిగే అప్పు కోసం అశోక్ కుమార్ హత్య జరిగింది అన్న కథనాల్లో వాస్తవాలు లేవంటున్నారు ప్రజలు. జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యకాండల వెనుక ఉన్న అసలు కారణాలు తెరవెనుకే కనుమరుగవుతున్న ట్లు ప్రచారాలు సైతం సాగుతున్నాయి. ప్రస్తుతం అశోక్ పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ హత్యకు దారి తీసింది అని పోలీసు వర్గాలకు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా పోలీసులు ఈ హత్య అసలు వాస్తవాలు వెలికి తీసే విధంగా దర్యాప్తు చేస్తారో లేదో వేచి చూడాలి.

Next Story

Most Viewed