- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామాలయంలో హుండీ చోరీ...
by Kodari Anjali |
గుర్తు తెలియని దుండగులు రామాలయంలో హుండీ పగులగొట్టి అందులోని డబ్బు అపహరించారు.

X
దిశ, కరకగూడెం: మండల పరిధిలోని అనంతారం గ్రామంలోని రామాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ పగులగొట్టబడినట్లు గమనించి ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు.
Next Story






