అక్రమార్జనే అంతిమ లక్ష్యం

by Elthuri vijay kumar |

సీతారామ ప్రాజెక్ట్ లో సర్వం తానై పనిచేస్తున్న ఓ అధికారి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు

అక్రమార్జనే అంతిమ లక్ష్యం
X

అక్రమార్జనే అంతిమ లక్ష్యం

- ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే తతంగం

- గుత్తేదారుడికి కూడా అంతుపట్టని విధంగా దొంగలెక్కలు

- సీతారామ ప్రాజెక్ట్ లో సర్వం తానై పనిచేస్తున్న ఓ అధికారి

- ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు

దిశ, కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్ట్ లో సర్వం తానై పనిచేస్తున్న ఓ అధికారి పనితీరూ రోజుకొక కొత్త కోణంబయటపడుతుంది...ఆయనొక మండల స్థాయి అధికారి, కానీ జిల్లా స్థాయి నిర్ణయాలు నియంత పోకడలు. అసలు కాంట్రాక్టర్ కే అంతుపట్టని రీతిలో దొంగ లెక్కలు వేయడం లో దిట్ట. జిల్లా ఉన్నతాధికారుల దీవెనలతో , భరోసా తో ఆయన అనుకున్నదే కింద స్థాయి అధికారి రాయాలి, అదే కరెక్ట్ అని పై స్థాయి అధికారికి హుకుం జారీ చేయగల సమర్ధుడు.నీకు సగం నాకు సగం అంటూ.. వచ్చిన వాటాలు పెట్టుకునే స్థాయికి చేరుకున్నారంటే అక్రమంగా ఏ మేరకు దండుకుంటున్నారో తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... అన్న సామెతను ఈ అధికారి నిజం చేసి చూపిస్తున్నారు.. తన చేతిలో అధికారం ఉంది తాను ఏం చేసినా బయటపడదులే అనుకుంటూ ,అనుమానం రాకుండా ఈ ఇంజనీర్ అధికారి పావులు కదుపుతున్నాడు. అసలు అక్కడ ఏ పని జరగకపోయినా దానిని చేయించినట్లు రికార్డ్స్ సృష్టిస్తూ ఆ వచ్చిన నిధులన్నీ తన ఖాతాలో జమ చేసుకుంటున్నాడు. సదరు అధికారి తీరు చూసి ఆ పనులను చేజిక్కించుకున్న గుత్తేదారుడు సైతం నిర్గాంత పోతున్నాడు అంటే ఆ ఇంజనీర్ పనితనం ఏ మేరకు ఉందో ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది. తనకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తాను ఏం చేసినా ఎవరు అడగరులే అనుకొని కాళేశ్వరానికి మించి సీతారామను దోచుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని చెప్పకనే చెప్పుకోవచ్చు.ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు సదరు ఇంజనీర్ అధికారిపై ఆ పనుల పరిశీలన కోసం ఎవరు వెళ్ళింది లేదు. ఆ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని బయటపెట్టింది లేదు అంటే ఆ ఇంజనీరింగ్ అధికారి ఆ స్థాయిలో ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అసలు ఏం లేకపోయినా అక్కడ ఏదో జరిగింది అని చూపిస్తూ శూన్యం నుండి కాసులు రాలుస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి డౌట్ రాకుండా రికార్డులు సైతం రహస్యంగానే మెయింటైన్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వీటితో సరిపెట్టుకోకుండా ఉన్నత స్థాయి అధికారులకు సైతం కేటాయించిన వాహనాలను ఈ అధికారే ఉపయోగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి...

- అధికారి తీరుపై అనుమానాలు ఎన్నో

సీతారామ ప్రాజెక్టు రెండు ప్రధాన కాలువ పనులు హ్యాండిల్ చేస్తున్న ఓ అధికారి తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కింద జరుగుతున్న ఇరిగేషన్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి భారీ స్థాయిలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు బాహాటంగానే వినపడుతున్నాయి. స్థానిక ప్రజలే కాదు అక్కడ పని చేసే సిబ్బంది సైతం ఇదే విషయాన్ని చర్చించుకోవడం మరి విడ్డూరంగా ఉంది అయితే సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణంలో భారీ స్థాయిలో కోట్లది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అవగతం అవుతోంది. ఇంత అవినీతి,అక్రమాలు,కుంభకోణాలు జరుగుతున్నా పై స్థాయి అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

- ప్రధాన కాలువ తీసే సమయంలో కాలువ నుండి వచ్చిన రాయిని మట్టిని కూడా అక్రమంగా అమ్ముకొని భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కొంతమంది బహిర్గతం చేసేందుకు ప్రయత్నించిన కానీ అధికారులకు తెలియజేసినా కానీ ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి విచారణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది- రికార్డులు మొత్తం రహస్యంగానే

సీతారామ ప్రాజెక్టులో జరుగుతున్న పనులకు సంబంధించిన రికార్డులన్నీ సదరు అధికారి రహస్యంగానే దాస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. పనులు చేయకపోయినా చేసిన పనుల్లో సైతం నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా కోట్లాది రూపాయల బిల్లులు సృష్టిస్తూ, నీకు సగం నాకు సగం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. అధికార యంత్రాంగం దీనిపై స్పందించి పూర్తి విచారణ జరిపి అవినీతి అక్రమాలకు భారీ కుంభకోణానికి పాల్పడిన సదరు అధికారిపై శాఖపరమైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story