గిరిజ‌నుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మ‌హారాజ్

by Nallavelli.Anjaneyulu |

గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మ‌హారాజ్ అని వైరా ఎమ్మెల్యే మాలోతు రామ‌దాస్ నాయ‌క్ పేర్కొన్నారు.

గిరిజ‌నుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మ‌హారాజ్
X

దిశ, ఏన్కూర్ : గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మ‌హారాజ్ అని వైరా ఎమ్మెల్యే మాలోతు రామ‌దాస్ నాయ‌క్ పేర్కొన్నారు. మండ‌లంలోని ఇమామ్ న‌గ‌ర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో సంతు సేవాలాల్ మహారాజు జయంతి వేడుకలు నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గిరిజనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింద‌ని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం అని అయన అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ విశిష్టతను వివరించారు. సంతు సేవాలాల్ మహారాజ్ వైరా నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, జ్యోతి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ కమిటీ చైర్మన్, గుగులోతు లచ్చిరాం నాయక్, పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు,గిరిజన పెద్దలు, అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.

Next Story