Assembly Speaker : ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్..

by Batti.Sumithra |

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Assembly Speaker : ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్..
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ సమావేశం కొనసాగుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

సభ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జన్మ దినం సందర్భంగా వైరా మండలం విప్పలమడక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్షల ఉదయ్ ఆధ్వరంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.

Next Story