- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వం సిద్ధం..నేడే రెండో దశ పోరు
జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఏ

దిశ ఖమ్మం కార్పొరేషన్/ ప్రతినిధి కొత్తగూడెం: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల పరిధిలో ఉన్న 183 గ్రామ పంచాయతీలు, 1686వార్డులకు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు, 23గ్రామ పంచాయతీలు, 306వార్డులు ఏకగ్రీవం ఎన్నిక కావడంతో మిగిలిన 160గ్రామ పంచాయతీలకు మొత్తం 451మంది, 1379వార్డులకు మొత్తం 3352 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు తెలిపారు. ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికల నిర్వహణకు 2023 బ్యాలెట్ బాక్సులు, 1831పోలింగ్ అధికారులు, 2346 మంది సహాయ పోలింగ్ అధికారులను నియమించారు.
304 సమస్యాత్మక కేంద్రాలు
రెండవ విడతలో 28లొకేషన్స్ లో 304 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు చేపట్టనున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆరు మండలాల పరిధిలో మొత్తం మొత్తం 2,51,327మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఇందులో 1,21,164 మంది పురుషులు, 1,30,156 మంది మహిళా, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్‌కు అని సౌకర్యాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఏడు మండలాలు..
జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో 155గ్రామపంచాయతీలకు సర్పంచ్, 1,392 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల ప్రక్రియలో భాగంగా 16గ్రామాల్లో సర్పంచ్ పదవులు, 386వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో మిగిలిన 138 గ్రామపంచాయతీల్లో, 1006 వార్డులకు ఆదివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించనుండగా, అదే రోజున ఫలితాలు ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు సిద్ధం చేశారు. రెండవ విడత ఎన్నికలు అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకపల్లి, పాళ్వంచ మండలాల్లో జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 1,392 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2,11,892 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వసతులు అందుబాటులో ఉంచారు. ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే తరలించారు.
కీలక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కాస్టింగ్ ద్వారా ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి చేశారు.






