ఓటును కాపాడే బాధ్యత బూత్ కమిటీదే..

by Taduka Kalyani |

ఓటును కాపాడే బాధ్యత బీఆర్ఎస్ బూతు కమిటీ సభ్యులకుందని, ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కలిగిఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ జిల్లా ఇన్చార్జీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు.

ఓటును కాపాడే బాధ్యత బూత్ కమిటీదే..
X

దిశ, ఖమ్మంబ్యూరో: ఓటును కాపాడే బాధ్యత బీఆర్ఎస్ బూతు కమిటీ సభ్యులకుందని, ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కలిగిఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ జిల్లా ఇన్చార్జీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ మంగళవారం రఘునాథపాలెం, ఖానాపురంహవేలి, టూటౌన్ ప్రాంతాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులకు డిజిటర్ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పువ్వాడ, తక్కళ్లపల్లి మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియలో అవగాహనతో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఓటర్లకు అవసరమైన ధ్రువ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి పత్రాలు సమకూర్చాలని, నిర్ణీత గడుపులోగా సమర్పించేలా చూడాలని చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా లోపాలున్నా, సవరణలున్నా వెంటనే గుర్తించి సరిచేసే చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రక్రియ అమలులో ఎదురయ్యే లోపాలను అధిగమించేందుకు ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బూత్ కమిటీ సభ్యులకు లేదా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చునని , సమస్యల పరిష్కారానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అలాటే ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితానుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతీ ఓటు విలువైందని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జీ ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, శీలంశెట్టి వీరభద్రంతోపాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Next Story