- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జట్టును ఏలుతోన్న ఐదుగురు RCB ప్లేయర్లు
భారత జట్టును ఐదుగురు RCB ప్లేయర్లు ఏలుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. WPLలో భాగంగా బెంగుళూరు జట్టు తరుపున ఆడిన ఐదుగురు మహిళా క్రికెటర్లు, ఇప్పుడు భారత జట్టును కూడా ఏలుతున్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. స్మృతి మందాన, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ ఐదుగురు క్రికెటర్లు బెంగళూరు జట్టులో కొనసాగగా, ఈ ప్లేయర్లే భారత జట్టులో కూడా రాణిస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన నేపథ్యంలోనే వీళ్లను భారత జట్టులోకి కూడా తీసుకుంది బీసీసీఐ.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భారత జట్టు తరఫున కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నారు ప్లేయర్లు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ పురుషుల బెంగుళూరు జట్టులో ఉన్న ప్లేయర్లకు మాత్రం భారత జట్టులో అవకాశాలు రావడం లేదు. రెండు సార్లు టైటిల్ తీసుకువచ్చిన రజత్ పాటిదార్ ను భారత సెలక్టర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. వికెట్లపైన వికెట్లు తీస్తున్న భువనేశ్వర్ కు అవకాశమే ఇవ్వడం లేదు. 250 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టిన పడిక్కల్ అంటే పట్టనట్టే బీసీసీఐ వ్యవహరిస్తోంది. కృనాల్ పైన ఒక్క కన్ను కూడా వేయడం లేదు. రసిఖ్ దార్ కు దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో మహిళల ఆర్సీబీ జట్టు ప్లేయర్ల పనే బెటర్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.






