అనుమానాస్పదంగా సంచరిస్తూ పట్టుబడిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష

by Taduka Kalyani |

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయగా, న్యాయస్థానం 3 రోజుల కారాగార శిక్ష విధించింది.

అనుమానాస్పదంగా సంచరిస్తూ పట్టుబడిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
X

దిశ, చంపాపేట్ జూన్ 16: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయగా, న్యాయస్థానం 3 రోజుల కారాగార శిక్ష విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. బర్కాస్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అహ్మదుద్దీన్ (28), వృత్తిరీత్యా వెల్డర్, అనుమానాస్పద రీతిలో సంచరిస్తూ ఉండగా చాంద్రాయణగుట్ట పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై సిటీ పోలీస్ చట్టం (CP Act) సెక్షన్ 61(b) కింద ఈ-పెట్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో గల 9వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. గౌరవ న్యాయమూర్తి పి. నర్సింగ్ రావు కేసును విచారించి నిందితుడికి 3 రోజుల కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఎస్‌ఐ వి. శ్రీనివాసరావు వ్యవహరించగా, సీడీఓ బి. భరత్ కుమార్ సహకరించారు. చాంద్రాయణగుట్ట ఎస్‌హెచ్‌ఓ గోపినాథ్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు పూర్తి చేశారు.

Next Story