- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్లూరులో 50 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన..
by Batti.Sumithra |
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు.

X
దిశ, కల్లూరు : సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కల్లూరు మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మింకానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం, కల్లూరులో రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్, నీటి పారుదల శాఖ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
Next Story






