మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇంకా ఖారారు కానీ పొత్తులు..!

by Ratna Kumari |

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇంకా ఖారారు కానీ పొత్తులు..!
X

దిశ, ఖమ్మం రూరల్​ : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్​‌‌-సీపీఐ మధ్య‌ పొత్తు ఉంటుందని అందరు అనుకుంటున్న‌ప్ప‌టికీ ఇంత వరకు పొత్తుల పై ఎటువంటి ఇరు పార్టీల నుంచి ప్రకటన విడుదల కాలేదు. దీంతో పాటు సీపీఎం-బీఆర్​ఎస్​ మద్య పోత్తు పై కూడ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేడో రెపో నోటిఫికేషన్​ వచ్చే తరుణంలో ఇంత వరకు ఆయా పార్టీల మద్య పై ఇంకా స్పష్టత రాలేదు. వార్డు స్థాయి నుంచి చైర్మన్ పదవీ వరకు ఆశావాహుల సంఖ్య పెరగడంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 32వార్డులకు గాను అధికారులు ఈ నెల 17న వార్డుల వారిగా రిజర్వేషన్​లతో పాటు చైర్మన్​ కూడ రిజర్వేషన్​ ప్రకటించారు. ముఖ్యంగా రిజర్వేషన్ అమలు, సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలే ప్రధాన ప్రమాణాలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ప్రతి వార్డులోనూ ఇద్దరు, ముగ్గురు ఆశావాహులు పోటీపడుతుండటంతో పార్టీ కార్యాలయాలు రోజంతా సందడిగా మారాయి. స్థానిక నేతలతో భేటీలు, అధిష్టానం వద్దకు వినతులుఇవన్నీ సాధారణమయ్యాయి. కొందరు ఆశావాహులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఉన్న వార్డుల్లో ఆశావాహుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. “ఈసారి అవకాశం వస్తే అభివృద్ధి చేస్తాం” అంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గెలుపు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్లు దక్కని పక్షంలో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశముందన్న ఆందోళన కూడా పార్టీల్లో వ్యక్తమవుతోంది. దీనిని నివారించేందుకు అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవ ప్రయత్నాలు జరుగుతుండగా, మరికొన్ని వార్డుల్లో చివరి క్షణం వరకు ఉత్కంఠ తప్పేలా లేదు.మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. పార్టీలు తీసుకునే నిర్ణయాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓంటెద్దు పోకడలతో కొన్ని వార్డుల్లో తిప్పలు..

ఏదులాపురం మున్సిపాలిటీలో పాత పంచాయతీలైన పెద్దతండా, ఏదులాపురం, ముత్తగూడెం, వెంకటగిరి, గుర్రలపాడు, మద్దులపల్లి, తెల్దారుపల్లి, పోలేపల్లిపార్ట్​, గుదిమళ్ల, గొల్లగూడెం, బారుగూడెం రెడ్డిపల్లి పంచాయతీలు కలిశాయి. పెద్దతండాలో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములాగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకులు మాటతీరుతో పార్టీకి నష్టం వచ్చ అవకాశం ఉందని పరిశీలికుల అభిప్రాయం. అభ్యర్థుల ఎంపికలో ఒంటెద్దు పోకడులు అవలంభిస్తున్నారని, అందరి అభిప్రాయాలు తీసుకోకుండా ఎకాభిప్రాయాలతోనే పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని కొందరు నాయకుల అభిప్రాయం. అదే విధంగా మిగిలిన వార్డుల్లో సైతం ఇదే పరిస్థితి ఉందని పార్టీ నియమించిన పరిశీలనలో తెలిందని.. ఇదే నివేధికను మంత్రి పొంగులేటికి అందజేసినట్లు సమాచారం.

Next Story