- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంపు పై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి : CPM
ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ముంపు సమస్య పై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బీ. నర్సారెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, భద్రాచలం : ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ముంపు సమస్య పై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బీ. నర్సారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రాచలం పట్టణ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ బుధవారం అశోక్ నగర్ కొత్త కాలనీ ముదిరాజ్ బజార్ రామాలయ వీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కరకట్ట పునర్మాణ పనులు చేపట్టకుండా రామాలయ అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఓ పక్క పోలవరం ముంపు ముంచుకొస్తుంటే దానిపై స్పందించకుండా హడావుడి శంకుస్థాపనలు దేనికని ప్రశ్నించారు. కరకట్ట పునర్ నిర్మాణంతో పాటు గతంలోని శంకుస్థాపన చేసి వదిలేసిన సెంట్రల్ లైటింగ్ పనులపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని నర్సారెడ్డి డిమాండ్ చేశారు.
యాత్రికులకు కరకట్టపై నుండి వచ్చే చెత్త దుర్గంధం పొగతో స్వాగతం పలికే దౌర్భాగ్యం దాపురించిందని వెంటనే యాత్రికుల సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్ ని తరలించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు చుక్కా మాదారావు, చాట్ల శ్రీనివాసరావు, నాయకులు గోవర్ధన ఝాన్సీ, ఎర్రంశెట్టి పూర్ణిమ, సిహెచ్ ధనలక్ష్మి, దారిశెట్టి సతీష్ బాబు, ఎర్రం శెట్టి రాము, హైమావతి, ఆకుల సుశీల, లంబురమణ, అన్నం రమాదేవి, సంధ్యారాణి, వెంకటలక్ష్మి, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర గిరిజన నాయకులు రవి తేజ పాల్గొన్నారు.






