సర్పంచుల వెన్నంటి ఉంటా.. అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామి నవుతా

by Nallavelli.Anjaneyulu |

దిశ, చింతకాని : సర్పంచుల వెన్నంటి ఉంటా వారి సమస్యల పరిష్కారానికి తోడుగా ఉంటా,గ్రామాల అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామ్యం అ

సర్పంచుల వెన్నంటి ఉంటా.. అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామి నవుతా
X

దిశ, చింతకాని : సర్పంచుల వెన్నంటి ఉంటా వారి సమస్యల పరిష్కారానికి తోడుగా ఉంటా,గ్రామాల అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామ్యం అవుతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన చింతకాని మండల పరిధిలోని నాగులవంచలో ఏర్పాటుచేసిన చింతకాని,ముదిగొండ మండలాల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 70వ దశకంలో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్న సమయంలో మినహాయిస్తే 1983లో టీడీపీ వచ్చిన సందర్భంలో కానీ, 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో కానీ ప్రస్తుతం లాగా 131 స్థానాలకు 90 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం వివరించారు. మధిర నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఈ విషయాన్ని అంచనా వేసి తాను గెలిచిన మొదటి సారి ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు ప్రాజెక్టును ఆధునీకరణ చేశాను అని, వైరా బోనకల్లు మండలాలకు జాలిమూడి రిజర్వాయర్ నిర్మించాను,నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాను అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించి నియోజక అభివృద్ధికి ప్రణాళికలు వేశానని వివరించారు. అదేవిధంగా ప్రస్తుతం గెలుపొందిన సర్పంచులు అందుబాటులో ఉన్న పరిమిత వనరులను ప్రాధాన్యత క్రమంగా ఖర్చు చేయాలని వివరించారు.సర్పంచ్ గ్రామానికి పెద్ద కొడుకు లాంటివాడని అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఓటు వేసిన వారు, గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటూ గ్రామస్తులందరూ తనవారుగా భావించి అభివృద్ధి చేయాలని సూచించారు.పోరాటం తప్ప స్నేహం ఎరుగని గ్రామాల్లో నేడు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందంటే అందుకు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంతరాలు లేని సమ సమాజం సృష్టించాలన్న కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే కారణం అన్నారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా అత్యంత ప్రజాసామిక పద్ధతిలో జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.ఫలితాలు హర్షించదగిన రీతిలో వెల్లడి అయ్యాయని డిప్యూటీ సీఎం అన్నారు.ఎవరు సర్పంచులుగా గెలిచిన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేస్తాం అని డిప్యూటీ సీఎం అన్నారు.ఈ విజయ దుందుభి లో కాంగ్రెస్ కార్యకర్తల కృషి పోరాటం అద్భుతమైనదని అన్నారు. మొదటి విడతలో చేపట్టిన నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి ఐదు లక్షలు ఖర్చు చేస్తున్న తీరు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు.రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా అందులో 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఇందుకు గాను ప్రభుత్వం 13,500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 85% మంది 20 యూనిట్ల కింద ఉచిత విద్యుత్ కింద ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇంటింటికి వెళ్లి చీరలు పంపిణీ చేస్తున్నామని వివరించారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నాం అన్నారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.

ప్రతి సర్పంచ్ కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని,వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే నాయకుడు కాలేడు అని డిప్యూటీ సీఎం వివరించారు.ఈరోజు నుంచే సర్పంచుల బాధ్యత మొదలైంది కేవలం వ్యవసాయమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విద్యా, వైద్య రంగాలపై సర్పంచులు దృష్టి సారించాలని నిత్యం సమీక్షించాలని తెలిపారు.పిల్లలు ఎంత బాగా చదువుకొని పైకి వస్తే వారు ఊరు గురించి అంత బాగా ఆలోచిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సర్పంచులు పాఠశాలలను సందర్శించాలి అక్కడ బోధన ఎలా జరుగుతుంది వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో సమీక్షించి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని తెలిపారు. విద్య, వైద్యం రంగాలపై సర్పంచులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఈ రెండు అంశాలపై 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు లేదా తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. అంతరాలు లేని సమ సమాజం సృష్టించడం, ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ప్రజా ప్రభుత్వం ఎజెండా అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ,కొండాబాల కోటేశ్వర్రావు,రాయల నాగేశ్వరరావు,దొండపాటి వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు,మండల కేంద్ర సర్పంచ్ కిలారు మనోహర్ బాబు,కన్నెబోయిన గోపి,మడుపల్లి భాస్కర్,మరియు చింతకాని,ముదిగొండ పాల్గొన్నారు.

Next Story