- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో రాముడికి మహాపట్టాభిషేకం... పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్
భద్రాద్రి రాముడి పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ పాల్గొననున్నారు..

భద్రాచలంలో సీతారాముల కల్యాణం నయనానందకరంగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాలతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించగా.... ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కల్యాణం చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి రామయ్యకు అభిముఖంగా సీతమ్మ వారిని ఆసీనులను చేశారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామ మాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. 12గంటలకు వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచగా, 12.06నిమిషాలకు మాంగల్యధారణ జరిపించారు. కల్యాణ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం స్వామి వారికి మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
- దిశ, భద్రాచలం
దిశ, భద్రాచలం: భద్రాద్రిలో సీతారాముల కల్యాణం నయనానందకరంగా జరిగింది. ఆద్యంతం శ్రీరామ నామంతో భద్రగిరి మారుమోగింది. మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించగా ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కల్యాణం చూసి భక్తులు భక్తి పారావశ్యంతో పులకించిపోయారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. వేద పండితుల
మంత్రోచ్ఛారణలు..
కల్యాణ తంతును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు... మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.
శ్రీరాముని కల్యాణం చూడటమే మహద్భాగ్యంగా భావించిన భక్తులు అభిజిత్ లగ్నంలో రామయ్య, సీతమ్మ వార్ల జిలకర బెల్లం కల్యాణ తంతు చూసి పరవసులయ్యారు. తొలుత వ్విక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి రామయ్యకు అభిముఖంగా సీతమ్మ వారిని ఆసీనులను చేశారు. ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వరపూజ, స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్కాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం స్థానా చార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాసస్థ్యం వివరించారు. సరిగ్గా 12గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలను భక్తులకు అర్చకస్వాములు చూపించి సరిగ్గా 12.06 నిమిషాలకు మాంగల్యధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులకు ఆండాళ్లమ్మ, శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయంగా బంతులాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమాన్ని 12.15కి కన్నుల పండువగా నిర్వహించి అష్టోత్తరహారతి స్వామి వారికి సమర్పించి కల్యాణ తంతును ముగించారు. దేవానత జీయర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణం జరుగగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి,తుమ్మల నాగేశ్వరావు, కొండా సురేఖ, మహబూబాబాద్, నల్గొండ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కిరణ్ కుమార్‌రెడ్డి, భద్రాచలం, పినపాక, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు, తెలంగాణా, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శాంత కుమారి, నరహరి పాల్గొన్నారు.
భద్రాద్రి రాముడికి పట్టాభిషేకం
భద్రాచలం పుణ్యక్షేత్రంలో స్వామివారికి మహాపట్టాభిషేకం ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.






