ఏసీబీ వలలో తహసీల్దార్, అధికారులు

by Elthuri vijay kumar |

భూభారతి ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, ఆర్ఐ, డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ వలలో తహసీల్దార్, అధికారులు
X

ఏసీబీ వలలో తహసీల్దార్, అధికారులు

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్..

దిశ,తల్లాడ: భూభారతి ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, ఆర్ఐ, డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ ఏసీపి వై.రమేష్ కుమార్ వివరాల ప్రకారం.. తల్లాడ మండలానికి చెందిన ఓ రైతు తన 15 గుంటల భూమికి భూభారతి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోత్ భాస్కర్ నాయక్, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ రైతు వద్ద రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

Next Story