- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. ఎట్టకేలకు కదిలిన అధికార యంత్రాంగం
మండల పరిధిలోని గుట్ట కింద గుంపు గ్రామ సమీపంలో గోదాం నిర్మాణం పనులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసైగలలో అక్రమ మట్టి దందా కొనసాగుతుందని దిశ దినపత్రికలో గుట్ట గుల్ల అనే కథనానికి ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు.

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని గుట్ట కింద గుంపు గ్రామ సమీపంలో గోదాం నిర్మాణం పనులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసైగలలో అక్రమ మట్టి దందా కొనసాగుతుందని దిశ దినపత్రికలో గుట్ట గుల్ల అనే కథనానికి ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. బుధవారం గుట్ట కింద గుంపు గ్రామం పరిధిలోని ప్రభుత్వ గుట్టను మండల తహసిల్దార్ ఏ,రమేష్, జిపిఓ బానోత్ సుమతి,సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనుమతులు లేకుండా మట్టి తోలకాలు జరిపితే సహించేది లేదని మట్టి మాఫియాను హెచ్చరించారు. గుట్టకు సంబంధించిన మట్టిని గోదాం నిర్మాణం కొరకే ఉపయోగించుకోవాలని కాంట్రాక్టర్ కు తెలిపారు. ప్రైవేటు ఫ్లాట్లకు, ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులులేకుండా మట్టి తోలకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని అన్నారు. అనుమతులు లేకుండా గుట్ట పరిధిలో మట్టి తవ్వకాలకు పాల్పడితే సహించేది లేదని అనుమతులు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.






