- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వాన్ని చాటిన ఉపాధ్యాయులు
by Malleboina Mahesh |
మండలంలోని చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు.

X
దిశ, కూసుమంచి: మండలంలోని చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి కారులో బయలుదేరిన ఉపాధ్యాయులు హైవేపై వస్తుండగా లోక్య తండా సమీపంలో నాగయ్య గూడానికి చెందిన గణేష్ బైక్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎవరు స్పందించి ముందుకు రాకపోవడంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు నరేందర్, వీరేంద్ర, విజయలక్ష్మి, జయశీల అతన్ని లేపి.. ధైర్యం చెప్పారు. వెంటనే తమ కారులోనే కూసుమంచికి తీసుకువచ్చారు. వస్తూ వస్తూనే డాక్టర్ని అందుబాటులో ఉంచాలని సీఆర్పీ జాఫర్‌కి సమాచారం అందించారు. ఆ సమయంలో కూసుమంచిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే 108 కి ఫోన్ చేసి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. దీంతో ఉపాధ్యాయుల మానవత్వాన్ని పలువురు అభినందించారు.
Next Story






