- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెల్లని చెక్కు కేసులో ఉపాధ్యాయునికి 6 నెలల జైలు శిక్ష
చెల్లని చెక్కు కేసులో ఓ ఉపాధ్యాయుడికి 6 నెలల జైలు శిక్షతో పాటుగా రూ.9 లక్షల10 వేలు రూపాయలు పరిహారం కూడా

దిశ, సత్తుపల్లి: చెల్లని చెక్కు కేసులో ఓ ఉపాధ్యాయుడికి 6 నెలల జైలు శిక్షతో పాటుగా రూ.9 లక్షల10 వేలు రూపాయలు పరిహారం కూడా చెల్లించాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా న్యాయ మూర్తి ఎం. శ్రీనివాసరావు మంగళవారం తీర్పు వెలువరించారు. కల్లూరు మండలం ముచ్చారం గ్రామానికి చెందిన ముదిగొండ్ల రామనరసింహారావు అనే ప్రైవేట్ లెక్చరర్ దగ్గర ఖమ్మం పట్టణానికి చెందిన బూరుగు జయరాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2015 లో రూ.8.లక్షల 50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇక 6 నెలల తరువాత రూ.9 లక్షల 10 వేల చెల్లని చెక్కు ఇచ్చారు.
దింతో సత్తుపల్లి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టును ముదిగొండ్ల రామ నరసింహారావు ఆశ్రయించారు. ముదిగొండ్ల రామ నరసింహారావు తరఫున సీనియర్ న్యాయవాది పిన్నం జానకి రామారావు పిటిషన్ దాఖలు చేసారు. ఇక ఈ కేసు నేపథ్యంలో 2023 డిసెంబర్ లో 6 నెలల జైలు శిక్షతో పాటుగా రూ.9. లక్షల 10 వేలు పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. దింతో బూరుగు జయరాజు పై కోర్టుకు అప్పీల్ చేశారు. కాగా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన 6వ అదనపు జిల్లా న్యాయ మూర్తి శ్రీనివాసరావు కింది కోర్టు తీర్పును సమర్థించింది, చెల్లని చెక్కు ఇచ్చినందుకు గాను 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు బాధితునికి రూ.9 లక్షల పరిహారం, ప్రభుత్వానికి రూ.10 వేలు చెల్లించలంటూ తీర్పు నిచ్చింది.






