- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి టీడీపీ సిద్ధం
టేకులపల్లి మండల పరిధిలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండల పరిధిలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గుడిపూడి మోహన్ రావు, గజ్జల రామ్ శేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు ఇప్పటికీ గుర్తిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే మండల వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి ప్రజలలోకి వెళ్లడం జరిగిందన్నారు. మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు టిడిపి పోటీ చేస్తుందని వెల్లడించారు. పంచాయతీ, వార్డ్ స్థానాలకు టిడిపి అభ్యర్థులు పోటీలో ఉంటారని అలాగే కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు ఉంటాయని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుదామని ఈ సందర్భంగా తెలిపారు.






