- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు యువకుల ఆత్మహత్య.. మానవత్వం చాటిన మృతుల కుటుంబాలు
ఇద్దరు యువకుల మృతి అంధుల జీవితంలో వెలుగులు నింపాయి.

దిశ, కొడిమ్యాల: కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో విడివిడిగా జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు ఆత్మహత చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నరసింహులపల్లి గ్రామానికి చెందిన మాచర్ల అజయ్ (25) వ్యక్తిగత కారణాలతో అత్మహత్య చేసుకోగా ఘటనపై అతని సోదరి ఫిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే చెప్యాల గ్రామానికి చెందిన రుద్ర వేణి మధు (31) తన ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని..
గతంలో జరిగిన కుటుంబ విషాదాలు, ఆరోగ్య సమస్యల కారణంగా అతడు తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు ప్రాథమికంగా వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ రెండు ఘటనల్లోనూ మృతుల కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో నేత్రదానం చేయడం విశేషం. దుఃఖాన్ని దిగమింగుకొని తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం కల్పించారు. మృతుల కుటుంబ సభ్యుల మానవతా దృక్పథాన్ని స్థానికులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు.






