పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు..

by Elthuri vijay kumar |

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ 21వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు సోమవారం దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లబెల్లి గ్రామంలో పోలీసులు గట్టి వాహన తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు..
X

పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు..

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..

దిశ,దుమ్ముగూడెం: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ 21వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు సోమవారం దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లబెల్లి గ్రామంలో పోలీసులు గట్టి వాహన తనిఖీలు నిర్వహించారు. దుమ్ముగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటప్పయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించగా,సిపిఐ (మావోయిస్టు) 21 నుంచి 27 వరకు వార్షికోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, దుమ్ముగూడెం మండలంలో సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు జాగ్రత్తగా తనిఖీలు, గస్తీలు నిర్వహిస్తున్నారు. 2004లో ఏర్పడిన ఈ నిషేధిత సంస్థ సాధారణంగా ఈ సమయంలో ప్రచారం, గందరగోళం సృష్టించే అవకాశం ఉండొచ్చు. అందుకే పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. వారోత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు.

Next Story