- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూ ఇయర్ వేళ హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు : చింతకాని ఎస్సై వీరేందర్
దిశ, చింతకాని : చింతకాని మండల పరిధిలో న్యూ ఇయర్ వేడుకల వేళ హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు అని చింతకాని ఎస్సై వీరేందర్ తెలిపారు.

దిశ, చింతకాని : చింతకాని మండల పరిధిలో న్యూ ఇయర్ వేడుకల వేళ హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు అని చింతకాని ఎస్సై వీరేందర్ తెలిపారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మండల ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చింతకాని మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడ్, రాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడడం,రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులకు, యువతకు ఆయన సూచించారు.






