ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : డీఎస్పీ చంద్రబాను

by Ratna Kumari |

దిశ, టేకులపల్లి : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను శుక్రవారం

ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : డీఎస్పీ చంద్రబాను
X

దిశ, టేకులపల్లి : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను శుక్రవారం సులానగర్ లో పలు పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు జాగ్రత్తలు వహించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎలక్షన్ 48 గంటల ముందు ప్రచారం ముగించాలని, బెల్ట్ షాపులు కొనసాగిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎలక్షన్లపై ప్రచారం చేసే వాహనాలు మైకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ఆలకుంట రాజేందర్, పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Next Story