- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ కోటమైసమ్మ జాతరకు సిద్ధం
కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే శ్రీ కోట మైసమ్మ తల్లి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోటమైసమ్మ తల్లి మహా జాతర

దిశ, కారేపల్లి: కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే శ్రీ కోట మైసమ్మ తల్లి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోటమైసమ్మ తల్లి మహా జాతర అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏటా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే జాతరకు వేలాదిగా భక్త జనం తరలివస్తారు. ప్రభబండ్లతో వచ్చేభక్తజనం అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ స్థల పురాణం చరిత్ర ఖమ్మం జిల్లా, సింగరేణి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల క్రితం నాటి గుట్టమీద దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండేది.
ఉసిరికాయలపల్లి నుండి ఇల్లెందుకు కాలినడక మార్గం కలదు. ఓ రోజు పర్సా కృష్ణారావు రామచంద్రయ్య పటేల్ దారి బాటన వెళ్తుంటే 1948లో రజాకార్లు వెంబడించారు. వీరి నుండి రక్షిస్తే అమ్మవారికి గుడి కట్టిస్తానని మనసులో అనుకున్నారు. ఇప్పచెట్టు గుహలో దాక్కున్నారు. వారి నుండి రక్షించబడి, అమ్మవారిని ఈ ప్రదేశం నందు బొమ్మల నర్సయ్య శిల్పిచే అమ్మవారిని శిలగా చెక్కించి ఈ ప్రాంత దొర అయిన పర్సా కృష్ణారావు- దమయంతి దంపతులు ప్రతిష్ఠించి నిర్మించడం జరిగింది. అదేక్రమంలో ఆనాటి నుండి ప్రతియేటా పర్సా కృష్ణారావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేవారు. తదనంతరం వారి కుమారుడు డాక్టర్ పర్సా పట్టాభి రామారావు – విజయలక్ష్మి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతూ నవరాత్రులు, జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.
రెండు జిల్లాల సరిహద్దులో
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం - భద్రాద్రి జిల్లా ఇల్లెందు సరిహద్దులోని ఉసిరికాయపల్లిలో కొలువుదీరిన శ్రీకోటమైసమ్మ తల్లి జాతరను దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాలతో పాటు భద్రాద్రి జిల్లా ఇల్లెందు, టేకులపల్లి, మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ మేరకు భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా దేవతామూర్తులు
కోటమైసమ్మ జాతరలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాక ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నాయి. శంకరుడి విగ్రహంతో పాటు 20 అడుగుల ఎత్తుతో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడు, శ్రీ సరస్వతీ దేవి విగ్రహాలు భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇక జాతరకు వచ్చే భక్తులు, పిల్లలకు వినోదం, ఆహ్లాదాన్ని పంచేందుకు సర్కస్ ఏర్పాటవుతోంది. రెండు జాయింట్ వీల్స్, ఒక కొలొంబో తదితర సర్కస్ ఫీట్లతో భక్తులు ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంది.






