- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మంలో శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్ బుక్స్ గోడౌన్ సీజ్
ఖమ్మం పట్టణంలోని మమతా రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్‌కు చెందిన పుస్తకాల గోడౌన్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు.

దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం పట్టణంలోని మమతా రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్‌కు చెందిన పుస్తకాల గోడౌన్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ పేరుతో ఉన్న లోగోతో కూడిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెంటనే స్పందించారు. అనంతరం విద్యాశాఖ మండల అధికారి శైలజ, విద్యార్థి సంఘాల నాయకుల సమక్షంలో స్కూల్‌కు సంబంధించిన రెండు గోడౌన్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై వేల రూపాయల అదనపు భారం మోపుతున్నాయని ఆరోపించారు. పాఠశాలల లోగోతో కూడిన నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాల విక్రయం నిషేధం ఉన్నప్పటికీ, విద్యాశాఖ పర్యవేక్షణ లోపంతో అనేక ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జార్జి రెడ్డి పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఏ, ఐయూఎంఎల్ అనుబంధ విద్యార్థి విభాగం ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.






