చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి: తహశీల్దార్ అరుణ

by I. Sairam |

చదువుతోపాటు మానసిక శారీరక ఆనందాన్ని కలిగించే ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక తహశీల్దార్ ఎన్ అరుణ పేర్కొన్నారు.

చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి: తహశీల్దార్ అరుణ
X

దిశ, కొణిజర్ల: చదువుతోపాటు మానసిక శారీరక ఆనందాన్ని కలిగించే ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక తహశీల్దార్ ఎన్ అరుణ పేర్కొన్నారు. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో గల తెలంగాణ ముస్లిం గురుకుల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చదువుకు ఎంత ప్రాధాన్యత ఉందో క్రీడలకు అంత ప్రాధాన్యత ఉందన్నారు.

పీటీ ఉషా, గోపీచంద్ వంటి ప్రముఖులు క్రీడల ద్వారా గుర్తింపు పొంది దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని వారిని ఆదర్శంగా తీసుకుని పోటీలలో రాణించాలని సూచించారు. కప్ చైర్మన్ ఎంపీడీవో వర్షా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వెలికి తీయడం కోసం ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ఎంఈఓ అబ్రహం, మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ జితీష్ సాహెల్ ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వర్లు పీడీలు రంజాన్ శంకర్ సక్రాం మహేష్, రాంబాబు పాల్గొన్నారు.

Next Story