నేనే డీఎంఅండ్ హెచ్ ఓ...!

by velandi.Saikiran |   (  Updated:2025-11-07 11:38:27  IST  )

నేనే ఖమ్మం డీఎంఅండ్ హెచ్ ఓ అంటూ అధికారి హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంచార్జీగా ఉన్న డీఎంఅండ్ హెచ్ ఓ

నేనే డీఎంఅండ్ హెచ్ ఓ...!
X

దిశ, ఖమ్మం: నేనే ఖమ్మం డీఎంఅండ్ హెచ్ ఓ అంటూ అధికారి హల్ చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంచార్జీగా ఉన్న డీఎంఅండ్ హెచ్ ఓ అధికారి వ్వక్తిగత సెలవుల్లో ఉండటంతో ఇంచార్జీగా అతనికి ఇచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి నేనే డీఎంఅండ్ హెచ్ ఓ అంటూ చేస్తున్న హడపూడి అంత ఇంతా కాదు. నాకే వస్తుంది... నేనే ఉంటాను... నాకు పై స్థాయిలో నెట్వర్క్ ఉంది అంటూ సిబ్బందితో చెప్పడం... తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సార్ ఎక్కడ పని చేసినా వివాదాస్పదమే. గతంలో హైదరాబాద్ వైద్యారోగ్యశాఖ కమిషనరేట్ అధికారులను చేయి తడిపి, ఎంక్వైరీ రిపోర్ట్ ను తారుమారు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం డీఎంఅండ్ హెచ్ ఓ ఆఫిస్ కు వచ్చిన తర్వాత అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని అల్లలాడిస్తున్నాడు. జిల్లాలోని వైద్యారోగ్యశాఖలో పరిధిలో ఉన్న ప్రెమరీ హెల్త్ సెంటర్ లో ఇతనే జిల్లా అధికారిగా కొనసాగిస్తూ... ప్రస్తుతం ఉన్న అధికారి రిటైర్మెంట్ తర్వాత నాకే డీఎంఅండ్ హెచ్ ఓ వస్తుంది అంటూ చెప్పడం కొసమెరుపు. రెండు సంవత్సరాలుగా వైద్యశాఖలో తనకు అనుకూలంగా లేని ఉద్యోగులను ఇబ్బందులు పెట్టినా ఉదంతాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం డీఎంఅండ్ హెచ్ ఓ కార్యాలయంలో తనకు అనుకూలంగా కొంతమందికి టీంను కూడా తయారు చేసినట్టు సిబ్బంది బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలు అంటూ ఆర్డర్ కాపీ

ప్రస్తుతం ఇంచార్జీ డీఎంఅండ్ హెచ్ ఓగా కొనసాగుతున్న అధికారి, ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీల ఆర్డర్ కాపీ ను విడుదల చేశారు. ఆ కమిటీలో తన అనుచరులతో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కమిటీని జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేయాలని ప్రస్తుతం సెలవులో ఉన్న అధికారిని ఆదేశించారు‌. అయితే ఆమె సెలవుల్లో ఉండటంతో ఆగమేఘాల మీద గురువారం కమిటీ తయారు చేసి ఆర్డర్ కాపీ విడుదల చేశారు. ఈ ఆర్డర్ కాపీ లో ఇంచార్జీ డీఎంఅండ్ హెచ్ ఓ అంటూ సంతకం పెట్టుకుండా డైరెక్ట్ గా రెగ్యులర్ డీఎంఅండ్ హెచ్ ఓ అంటూ సంతకం చేయడంపై వైద్యశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆర్డర్ కాపీ చూస్తూ కమిటీలో ఉన్న ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ కు వస్తున్నామంటూ మెసేజ్లు కూడా పంపించినట్లు తెలుస్తోంది.

- పలు ఆసుపత్రుల నుంచి కలెక్షన్లు...?

జిల్లా వైద్యారోగ్యశాఖ ఇంచార్జీగా ఓ అధికారి బాధ్యతలు స్వీకరించి ఏడు రోజులు అయింది. ఇప్పటికే అతను కలెక్షన్లు మొదలు పెట్టాడు అని సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు. ఈ ఏడు రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కమిటీ అడ్డం పెట్టుకొని భారీగా వసూళ్లకు తెర లేపినట్లు తెలుస్తోంది.

-ఈ సార్ ఎక్కడ ఉన్న వివాదాస్పదమే...?

ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇంఛార్జి గా పనిచేస్తున్న అధికారి ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమే. అక్కడ వైద్యులపై ఎక్కడ లేని విధంగా నిబంధనలు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు అతడు పీడియాట్రిక్ డాక్టర్ కాదంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. సిబ్బందిని డిప్యూటేషన్ చేయడం కోసం భారీ మొత్తంలో వసూళ్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఇలాంటి అధికారిణి కట్టడి చేసి, మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story